వైఎస్‌ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించిన ప్రభుత్వం | YS Rajasekhar Reddy Jayanthi as Farmers Day | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించిన ప్రభుత్వం

Jun 25 2019 8:28 AM | Updated on Mar 22 2024 10:40 AM

అన్నదాతల ఆపద్బాంధవుడు దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ప్రతి ఏటా వైఎస్‌ జయంతి అయిన జూలై 8వ తేదీన రైతు దినోత్సవం నిర్వహిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం కలెక్టర్ల సదస్సులో ప్రకటించారు. పంటల బీమా, రైతులకు వడ్డీలేని రుణం తదితరాలకు సంబంధించిన చెల్లింపుల అంశాలను ఆ రోజుకు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. వైఎస్సార్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కూడా ఆ రోజు పండుగలా నిర్వహించాలని సూచించారు.   

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement