మానవత్వం చాటుకున్న విస్సన్నపేట పోలీసులు

సాక్షి, విజయవాడ: వ‌ల‌స కార్మికుల విషయంలో మానవత‍్వం చూపాలన్న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల‌ను పోలీసులు తు.చ త‌ప్ప‌కుండా పాటిస్తున్నారు. కాలిన‌డ‌కన‌ మండుటెండ‌లో న‌డుస్తున్న గ‌ర్భిణీకి సాయం చేసి అందరి మ‌న్న‌న‌లు పొందిన ఘ‌ట‌న ఆదివారం కృష్ణాజిల్లా‌లో చోటు చేసుకుంది.‌ లాక్‌డౌన్ కార‌ణంగా ఇత‌ర ప్రాంతంలో చిక్కుకుపోయిన ఓ గ‌ర్భిణీ, త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి స్వ‌స్థ‌ల‌మైన‌ చ‌త్తీస్‌ఘ‌డ్‌కు బ‌య‌లు దేరింది. 

ఈ విషయాన్ని గమనించిన విసన్నపేట పోలీసులు...వారిని పోలీస్‌ స్టేష‌న్‌కు తీసుకెళ్లి భోజ‌నం పెట్టి మాన‌వ‌త్వం చాటుకున్నారు. ప్ర‌భుత్వ ఖ‌ర్చుల‌తో స్వ‌స్థ‌లానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. మ‌‌రోవైపు ఈ విష‌యం తెలుసుకున్న స్థానిక వ్యాపారి శ్రీనివాస్‌‌ త‌మ గ్రామానికి న‌డ‌కమార్గాన చేరిన నిండు చూలాలిపై సోద‌ర ప్రేమ చూపాడు. ఆమెకు శ్రీమంతం జ‌రిపించి, చీర, జాకెట్ సారె పెట్టి దీవించాడు. చ‌త్తీస్‌ఘ‌డ్ ఆడ‌పడుచుకు శ్రీమంతం చేసిన శ్రీనివాస్‌ను ఎస్సై ల‌క్ష్మ‌ణ్‌, ఎంఆర్ఓ మురళీకృష్ణ అభినందించారు. ఈ ఘ‌ట‌న‌పై గ్రామ‌స్థులు సైతం హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top