వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనానికి ఈ ఏడాది రెండురోజులపాటు అనుమతి ఇస్తామని, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాడు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని ఆయన వెల్లడించారు.