కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశీయ కంపెనీలకు భారీ బొనాంజా ప్రకటించారు. కార్పొరేట్ పన్నులను కుదిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ వస్తోన్న వార్తల్ని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖండించారు. తెలుగు దేశం నాయకులు తాడికొండ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే శ్రీదేవిని కులం పేరుతో దూషించిన ఘటనపై .....జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ విచారణ చేపట్టింది. కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి దేశం కోసం పనిచేసిన వ్యక్తి అని, ఆయనను విమర్శించే అర్హత మంత్రి జగదీష్‌రెడ్డికి లేదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు.
ఈనాటి ముఖ్యాంశాలు
Sep 20 2019 8:32 PM | Updated on Sep 20 2019 8:36 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement