ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Dec 6th Disha murder case All four accused killed in encounter | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Dec 6 2019 8:32 PM | Updated on Dec 6 2019 8:36 PM

‘దిశ’ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. దిశ కేసులో నిందితులు పోలీసులపైకి కాల్పులు జరపడంతోనే ఎదురుదాడి చేయాల్సి వచ్చిందని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. మరోవైపు దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవహక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) దర్యాప్తునకు ఆదేశించింది. ఇదిలా ఉండగా, పోక్సో చట్టం కింద ఉరిశిక్ష పడిన దోషుల క్షమాభిక్ష పిటిషన్ల అంశంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.  వీటితోపాటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతి చెందారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement