3 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు | Telangana Election Commissioner Nagi Reddy MPTC And ZPTC Elections Release Schedule | Sakshi
Sakshi News home page

3 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు

Apr 20 2019 4:53 PM | Updated on Apr 20 2019 5:01 PM

తెలంగాణాలో ఎన్నికల హడావిడి మళ్లీ మొదలైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి శనివారం విడుదల చేశారు. హైదరాబాద్‌లో నాగిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికలను 3 దశల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణాలో మొత్తం 5,857 ఎంపీటీసీ స్థానాలు, 539 జెడ్పీస్థానాలు ఉన్నాయన్నారు. 47 ఎంపీటీసీ స్థానాలతో పాటు, మంగపేట జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక నిర్వహించడం లేదని వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement