గ్రామ వలంటీర్‌పై టీడీపీ వర్గీయుల దాడి
టీడీపీ వర్గీయులు మరోసారి బరితెగించారు. పాత కక్షలతో ఓ గ్రామ వలంటీర్‌పై వేట కొడవళ్లతో దాడికి దిగారు. ఈ ఘటన జిల్లాలోని చక్రాయపేట మండలం కుమారకాల్వలో ఆదివారం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలతో టీడీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. కొడవళ్లు, రాళ్లతో వీరంగం సృష్టించారు. ఈ క్రమంలో గ్రామ వలంటీర్ తాళ్లపల్లె రాకేష్ (23), ఆయన బంధువుపై పాత కక్షల నేపథ్యంలో విరుచుకుపడ్డారు. దీంతో రాకేష్ చేతిపై కత్తిపోటు బలమైన గాయం చేసింది. రాకేష్ పెద్దనాన్న తాళ్లపల్లె జ్ఞానముత్తు (48 )పై వేట కొడవళ్లతో టీడీపీ వర్గీయులు దాడి చేయడంతో ఆయన తలకు బలమైన గాయమైంది. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి