సూరత్‌లో ఘోర అగ్నిప్రమాదం; 15 మంది మృతి | several died in Fire Accident In Surat | Sakshi
Sakshi News home page

సూరత్‌లో ఘోర అగ్నిప్రమాదం; 15 మంది మృతి

May 24 2019 6:32 PM | Updated on Mar 21 2024 11:10 AM

గుజరాత్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సూరత్‌లోని ఓ బిల్డింగ్‌లోని కోచింగ్‌ సెంటర్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో దాదాపు 15 మంది విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు.. విద్యార్థులు భవనంపై నుంచి దూకేందుకు ప్రయత్నించగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. ఆరు ఫైర్‌ ఇంజన్లతో దాదాపు 18 మంది రక్షణ చర్యలు చేపట్టారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement