కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను కోవర్టు అన్నందుకు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)ని బెదిరిస్తూ వ్యాఖ్యలు చేసినందుకు.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్షమాపణలు చెప్పాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు మాజీ ఐఏఎస్ అధికారులు డిమాండ్ చేశారు.