పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు కనీస మర్యాదను పాటించట్లేదు. ఖాళీ సమయం దొరికితే చాలా పని ప్రదేశంలోనే అసలు స్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. రాజస్తాన్‌లోని జాలోరీ జిల్లాలో ఉపాధ్యాయురాలు చేసిన నిర్వాకం ఆమెను ఉద్యోగానికి దూరం చేసింది. ఉపాధ్యాయులుకు ట్రైనింగ్ నిమిత్తం అధికారులు బుధవారం ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే కొంత విరామం దొరకడంతో విధులను మర్చి.. రెచ్చిపోయారు. నాగిని డ్యాన్స్ చేస్తూ ఊగిపోయారు. ఓ మహిళా టీచర్‌కు తోడు ఓ ఉపాధ్యాయుడు సైతం నాగిని నృత్యం చేస్తూ.. ఎంజయ్ చేశారు. పక్కనున్న తోటి ఉద్యోగులంతా చప్పట్లతో వారి డ్యాన్స్‌ను ఆస్వాదించారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నాగిని నృత్యం చేసిన ఇద్దరిని ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరో ఇద్దరు ఉద్యోగులకు షోకాజు నోటీసులు జారీచేశారు.
మహిళా టీచర్ నాగిని డ్యాన్స్
Nov 28 2019 8:45 PM | Updated on Nov 28 2019 8:58 PM
Advertisement
Advertisement
Advertisement
