కర్ణాటకలో కేబినెట్ విస్తరణతో రేగిన అసంతృప్తి సెగలు మరింత పెరిగాయి. కేబినెట్‌లో చోటు దక్కని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌తో సమావేశమై నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు శాఖల కేటాయింపుపై జేడీఎస్ మంత్రులు అసహనంతో ఉన్నారు. జేడీఎస్ మంత్రులు జీటీ దేవెగౌడకు ఉన్నత విద్య, సీఎస్ పుట్టరాజుకు చిన్న నీటి పారుదల శాఖల కేటాయింపు చర్చనీయాంశమైంది.