సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తిరునగరి ప్రశాంత్ ఆత్మహత్యకు అతడి భార్య పావని కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు పావనిని అరెస్ట్ చేశారు. ఆమెపై ఐపీసీ సెక్షన్ 306 కింద (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కేసు నమోదు చేశారు. పైళ్లైన కొద్ది రోజుల తర్వాత తన భార్య వేముల ప్రణయ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు ప్రశాంత్ గుర్తించాడని పోలీసులు తెలిపారు. వారిని విడదీసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.కాగా, ప్రశాంత్, పావని మధ్య గతంలో జరిగిన ఫోన్ సంభాషణల ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ప్రశాంత్ అంటే ఏమాత్రం, తనను వదిలేయాలని పావని చెబుతున్నట్టు ఆడియోలో స్పష్టంగా ఉంది. ప్రేమగా చూసుకుంటానని భర్త ఎంత చెప్పినా ఆమె వినిపించుకోలేదు. చచ్చిపోతానని బెదిరించిన ఆమె భయపడలేదు. తనకు ప్రణయ్ ముఖ్యమని, భర్త కాదని తేల్చిచెప్పింది.
టెకీ ఆత్మహత్య.. వెలుగులోకి ఆడియో
Nov 1 2018 11:53 AM | Updated on Nov 6 2018 8:08 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement