ఎన్నారై మహిళపై ఎమ్మెల్సీ దాడి | NRI women was slashed by TRS MLC Farooq | Sakshi
Sakshi News home page

ఎన్నారై మహిళపై ఎమ్మెల్సీ దాడి

Oct 9 2017 10:30 AM | Updated on Mar 22 2024 11:03 AM

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌ ఓ ఎన్నారై మహిళపై దాడిచేసినట్లు నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన తాలూకు వీడియో ఇప్పటికే వైరల్‌ అయింది. వివరాల్లోకి వెళితే.. అంతుల్‌ వాసే అనే ఎన్నారైకి హైదరాబాద్‌ నాంపల్లిలో ఓ సొంత ఇల్లుంది. గడిచిన పదేళ్లుగా ఫారూఖ్‌ హుస్సేన్‌ ఆ ఇంట్లోనే అద్దెకుంటున్నారు. అయితే, ఇప్పటికీ అతను నామమాత్రపు అద్దె మాత్రమే చెల్లిస్తున్నాడని, నిలదీసి అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇంటి యజమాని అంతుల్‌ చెప్పారు. చెప్పుతో కొట్టిన ఎమ్మెల్సీ : విదేశాల నుంచి ఆదివారమే హైదరాబాద్‌కు వచ్చిన యజమానురాలు అంతుల్‌.. తన సోదరుడితో కలిసి ఈ రోజు ఉదయం నేరుగా నాంపల్లిలోని ఇంటికి వెళ్లింది. ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా ఫారూఖ్‌ను కోరింది. ఈ క్రమంలో ఇరువురి వాగ్వాదం చోటుచేసుకుంది. ‘అద్దె ఇవ్వను, అపార్ట్‌మెంట్‌ ఖాళీ చేయను. ఏం చేసుకుంటావో చేసుకో, ఎవడికి చెప్తావో చెప్పుకో..’ అని ఫారూఖ్‌ బెదిరించినట్లు బాధిత మహిళ ఆరోపించింది. ఒక దశలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌ మహిళను చెప్పుతో కొట్టినట్లు తెలిసింది. ఇంటి నుంచి నేరుగా నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన బాధితురాలు.. ఎమ్మెల్సీ తనపై దాడి చేశారని, అద్దె చెల్లించడం లేదని ఫిర్యాదుచేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అధికార పార్టీ ఎమ్మెల్సీ కావడంతో ఆచితూచి స్పందిస్తోన్న పోలీసులు.. ప్రస్తుతానికి కేసు నమోదు చేయకుండానే, దర్యాప్తు చేపట్టారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement