ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు మరోసారి చుక్కెదురైంది. నాంపల్లి కోర్టు మంగళవారం ఆయనకు వ్యతిరేకంగా నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. వేమూరి రాధాకృష్ణ మంగళవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. కానీ, ఆయన హాజరుకాకపోవడంతో నాంపల్లి కోర్టు సీరియస్‌గా స్పందించింది. ఇప్పటికే వేమూరి రాధాకృష్ణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.