నాయీ బ్రాహ్మణులను కించపరిచేలా మాట్లాడిన టీడీపీ ఎంపీ కేశినేని నాని క్షమాపణ చెప్పాలని రాష్ట్ర నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు యనాదయ్య డిమాండ్ చేశారు. ఎంపీ నాని నాయి బ్రాహ్మణలు కులాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం విజయవాడలో నాయిబ్రాహ్మణలు ఆందోళన చేపట్టారు. నాని కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. నానిని టీడీపీ నుంచి బహిష్కరించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నుంచి నానిని సస్పెండ్ చేయకుంటే చంద్రబాబు ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీ కులాలను అవమానించిన చంద్రబాబుపైన కేసులు పెట్టాలని వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులకు అధికారం కత్తిరించినా అహంకారం తగ్గలేదని విమర్శించారు.
‘అధికారం కత్తిరించినా అహంకారం తగ్గలేదు’
Oct 30 2019 1:40 PM | Updated on Mar 21 2024 11:38 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement