-
‘అధికారం కత్తిరించినా అహంకారం తగ్గలేదు’
-
కేశినేని నానిని టీడీపీ నుంచి బహిష్కరించాలి..
సాక్షి, విజయవాడ : నాయీ బ్రాహ్మణులను కించపరిచేలా మాట్లాడిన టీడీపీ ఎంపీ కేశినేని నాని క్షమాపణ చెప్పాలని రాష్ట్ర నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు యానాదయ్య డిమాండ్ చేశారు. ఎంపీ నాని నాయి బ్రాహ్మణలు కులాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం విజయవాడలో నాయిబ్రాహ్మణలు ఆందోళన చేపట్టారు. నాని కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. నానిని టీడీపీ నుంచి బహిష్కరించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నుంచి నానిని సస్పెండ్ చేయకుంటే చంద్రబాబు ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీ కులాలను అవమానించిన చంద్రబాబుపైన కేసులు పెట్టాలని వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులకు అధికారం కత్తిరించినా అహంకారం తగ్గలేదని విమర్శించారు. గతంలో తమ తోకలు కత్తిరిస్తామన్న చంద్రబాబుకు ఎన్నికల్లో ఆయన తోక కత్తిరించినా సిగ్గు రాలేదని విరుచుకుపడ్డారు. ‘తమతో పెట్టుకుంటే పిల్లిబొచ్చు కాదు నీ నాలుక కత్తిరిస్తాం జాగ్రత్త..’ అంటూ కేశినేని నానిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. నాయిబ్రాహ్మణ నంద యువసేన అధ్యక్షుడు ఇంటూరి బాబ్జి మాట్లాడుతూ నాయీబ్రాహ్మణులను కించపరిచే విధంగా వాఖ్యలు చేసిన కేశినేని నానిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నాయిబ్రాహ్మణలపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని వెంటనే ఎంపీ నాని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేశినేనిపై కడప డీఎస్పీకి ఫిర్యాదు తమ కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత కేశినేని నానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నాయిబ్రాహ్మణ సంఘం నాయకుడు యానాదయ్య బుధవారం కడప డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేశినేని నానిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో తమను సచివాలయంలో బహిరంగంగా దూషించారని నాయిబ్రాహ్మణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రెండో రోజు క్షురకుల ఆందోళన
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement