టీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఆదివారం నిర్వహించాలని తలపెట్టిన కొంగరకలాన్‌లోని ప్రగతి నివేదన సభ వద్ద భారీ వర్షం కురుస్తోంది. భారీ కటౌట్లు వర్షం దాటికి కూలిపోతున్నాయి. వర్షం ఇలాగే కొనసాగితే రేపటి మీటింగ్‌కు ఇబ్బంది కలిగే అవకాశం కనిపిస్తోంది. గులాబీ దళపతి కేసీఆర్ ఈ సభ ద్వారా ఎన్నికల సమరభేరీ మోగించనున్నట్లు సంకేతాలు వస్తుండటంతో అందరి దృష్టి కొంగరకలాన్ సభపైనే ఉంది. ప్రగతి నివేదన సభలో 4 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ ప్రజలకు వివరించనున్నారు.