జిల్లాలోని ధర్మవరంలో ముఠా కక్షలు భగ్గుమన్నాయి. మండలంలోని తిప్పేపల్లి గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డిపై ప్రత్యర్ధులు వేటకొడవళ్లతో దాడి చేశారు. గ్రామంలో లక్ష్మినారాయణ రెడ్డి, రామకృష్ణారెడ్డి వర్గాల మధ్య ఇరవై ఏళ్ళుగా ఆధిపత్య పోరు జరుగుతోంది. లక్ష్మినారాయణ రెడ్డిని రామకృష్ణారెడ్డి వర్గం నాలుగేళ్ళ కిందట హత్య చేశారు. ఇప్పుడు ఆయన సోదరుడు గోపాల్ రెడ్డిపై హత్యాయత్నం చేసి పారిపోయారు. రక్తపు మడుగులో పడిన ఉన్న గోపాల్ రెడ్డిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే గత కొంతకాలంగా గోపాల్ రెడ్డి నేర చరిత్రకు దూరంగా ఉంటున్నారు. సమీపంలోని ధ్యాన కేంద్రంలో ప్రవచనాలు చెబుతున్నాడు. అయితే గోపాల్ రెడ్డిపై ఎందుకు దాడి చేశారన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.
ధర్మవరంలో భగ్గుమన్న పాత కక్షలు
Jun 11 2018 9:47 AM | Updated on Mar 21 2024 7:48 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement