చిరంజీవిని కలిసిన సోము వీర్రాజు | BJP Chief Somu Veerraju Meet Chiranjeevi | Sakshi
Sakshi News home page

చిరంజీవిని కలిసిన సోము వీర్రాజు

Aug 6 2020 6:41 PM | Updated on Mar 22 2024 10:50 AM

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం సినీ నటుడు చిరంజీవిని కలిశారు. బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారి చిరంజీవిని హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవి ఈ సందర్భంగా సోము వీర్రాజుకు అభినందనలు తెలిపి పుష్పమాల, శాలువాతో సత్కరించారు. సోదరుడు పవన్‌ కల్యాణ్‌తో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement