‘రేవంత్‌ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడితే తాట తీస్తా

‘రేవంత్‌ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడితే తాట తీస్తా’ అని టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ హెచ్చరించారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌ రెడ్డి ముమ్మాటికి చంద్రబాబు ఏజెంటే అని ఆరోపించారు. ఆయన సింగపూర్‌ ఆస్తుల్లో రేవంత్‌ రెడ్డి బినామీ అని, ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు డబ్బుతోనే రేవంత్‌ రెడ్డి దొరికారన్నారు. రేవంత్‌ రెడ్డి ఓ దొంగ, ఆర్థిక అరాచక వాదని, తెలంగాణకు పట్టిన చీడపురుగని మండిపడ్డారు. డొల్ల కంపెనీలు, అక్రమాస్తులపై వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top