టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్షలు(టీఆర్‌టీ) తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. శనివారం ఉదయం 52 కేంద్రాల్లో లాంగ్వేజి పండిట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పరీక్షకు 17,970 మంది దరఖాస్తు చేసుకోగా.. 17,333 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన స్కూల్ అసిస్టెంట్ తెలుగు పరీక్షకు 16,827 మంది దరఖాస్తు చేసుకోగా.. 15,473 మంది హాజరయ్యారు. కొన్ని చోట్ల హాల్‌టికెట్లలో పరీక్ష కేంద్రం పేర్లు మారడం.. తప్పుగా ముద్రితమవ్వడంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. దీంతో ఒక కేంద్రం నుంచి మరో కేంద్రానికి వెళ్లే క్రమంలో ఆలస్యం కావడంతో పరీక్ష రాయలేకపోయారు.