కరోనా పోరాటంలో బాధితుల్ని ఆదుకోవడానికి ఏర్పాటు చేసి లైవ్ కాన్సర్ట్ ‘ఐ ఫర్ ఇండియా’ కార్యక్రమాన్ని వీక్షించి, విరాళాన్ని అందించిన ప్రతి ఒక్కరికి బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించిన రెండు రోజుల అనంతరం అనిల్ కపూర్ మంగళవారం సోషల్ మీడియాలో లైవ్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘ఐ ఫర్ ఇండియా’లో తన పార్ఫామెన్స్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఐ ఫర్ ఇండియా’ను చూసి విరాళాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇప్పటి వరకు చూడని వారు సైతం చూసి విరాళాలు ఇవ్వాలని కోరారు. కరోనావైరస్‌కు వ్యతిరేకంగా చేస్తున్నపోరాటానికి తోచినంత సహాయం అందించాలని ప్రజలలను కోరారు.
మీరందరూ సూపర్ హీరోలే
May 5 2020 3:40 PM | Updated on May 5 2020 3:47 PM
Advertisement
Advertisement
Advertisement
