బాలీవుడ్ నటి దీపికా పదుకొనే భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలసి గురువారం తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. బుధవారం తిరుమల చేరుకున్న వీరు రాత్రి ఇక్కడే బస చేశారు. ఈ ఉదయం స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. తమ మొదటి పెళ్లిరోజు సందర్భంగా వారు తిరుమలకు వచ్చారు. రేపు అమృత్‌సర్‌లో స్వర్ణదేవాలయాన్ని దర్శించుకోనున్నారు.