ఐపీఎల్ 7 లో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. ఈ రోజు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ - కోల్ కతా నైట్ రైడర్స్ ల మధ్య తొలి మ్యాచ్ జరగాల్సి ఉంది. క్వాలిఫయర్ మ్యాచ్ జరిగే కోల్‌కతాలో ఆదివారం నుంచి భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం కూడా వర్షం పడటంతో మ్యాచ్ ను రేపటికి వాయిదా వేశారు. ఈడెన్ గార్డెన్ నీటితో నిండిపోవడంతో సోమవారం ఇరు జట్లూ ప్రాక్టీస్ చేయలేదు. ఈ రోజు ఆట సాధ్యం కాకపోవడంతో ‘రిజర్వ్ డే’ అయిన బుధవారం నిర్వహిస్తామని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ సుబీర్ గంగూలీ తెలిపాడు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు మ్యాచ్ నిర్వహిస్తామన్నారు. ఒకవేళ ఆ రోజూ మ్యాచ్ సాధ్యం కాకపోతే నిబంధనల ప్రకారం లీగ్ దశలో మెరుగైన రన్‌రేట్ ఉన్న కింగ్స్ ఎలెవన్ ఫైనల్ చేరుకునే అవకాశం ఉంది.
May 27 2014 8:44 PM | Updated on Mar 21 2024 6:35 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement