భారత్ 22 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. శ్రీలంకలో రెండు దశాబ్దాల తర్వాత టెస్టు సిరీస్ విజయం సాధించింది. లంకతో మూడో టెస్టులో టీమిండియా 117 పరుగులతో గెలుపొందింది. దీంతో ఈ మూడు టెస్టుల సిరీస్ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. భారత టెస్టు కెప్టెన్గా విరాట్ కోహ్లీకిదే తొలి సిరీస్ విజయం.