20 ఓవర్లలో 3 వికెట్లకు 263 పరుగులు... అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సృష్టించిన పరుగుల సునామీ ఇది. వీర విధ్వంసకారుడు మ్యాక్స్‌వెల్ మెరుపు సెంచరీతో ముందుండి నడిపించగా... కంగారూలు కొత్త ప్రపంచ రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. వన్డేల్లో అత్యధిక స్కోరు రికార్డు బద్దలైన వారం రోజులకే అంతర్జాతీయ టి20ల్లోనూ కొత్త రికార్డు నమోదు కాగా, రెండు సార్లూ శ్రీలంక పేరిట ఉన్న రికార్డు బద్దలు కావడం విశేషం.