ఖమ్మం ఎంపీ, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధిరలోని గిరిజన బాలుర వసతిగృహంలో ఆదివా రం రాత్రి విద్యార్థులతో కలసి నిద్రించారు. విద్యార్థులకు సరైన వసతులు సమకూరుతున్నాయో లేదో తెలుసుకునేందుకే తాను హాస్టల్ నిద్ర చేసినట్లు ఆయన తెలిపారు. అంతకుముందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వసతిగృహ విద్యార్థుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డిమాండ్ చేశారు.