నేనేంటో కొన్ని గంటలలో చూపిస్తా: పన్నీర్ | will show in some hours what i am, says panneer selvam | Sakshi
Sakshi News home page

Feb 8 2017 9:11 AM | Updated on Mar 21 2024 8:11 PM

నిన్న మొన్నటి వరకు అత్యంత విశ్వాసపాత్రుడిగా, అసలు నోరు విప్పని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.. ఒక్కసారిగా తిరుగుబాటు చేశారు. తానేంటో కొన్ని గంటల్లోనే చూపిస్తానని సవాలు చేశారు. ఇప్పటివరకు తాను నోరు విప్పింది కేవలం పది శాతమేనని, ఇంకా 90 శాతం మిగిలే ఉందని అన్నారు. అవన్నీ తనతో చెప్పించే ప్రయత్నం చేయొద్దని అవతలి పక్షాన్ని హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం నుంచి తన దీక్ష, వ్యాఖ్యలు, పార్టీ పదవి తొలగింపు వంటి పరిణామాలతో తీవ్ర ఉత్కంఠ రేపిన పన్నీర్ సెల్వం.. ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement