ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో దినకరన్‌ను అరెస్ట్ చేసినప్పుడు ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నాయుడును ఎందుకు అరెస్ట్ చేయరని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో మరో దోపిడీకి తెర తీస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భావనపాడు పోర్టుకు గ్లోబల్ టెండర్లు ఎందుకు పిలవలేదని బొత్స ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.