breaking news
bhavanapadu
-
భావనపాడు పోర్టుకు మూలపేట పోర్టుగా నామకరణం
సాక్షి, విజయవాడ: శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పోర్టుకు మూలపేట పోర్టుగా నామకరణం చేస్తూ రాష్ట్ర పెట్టుబడులు మరియు మౌలిక వసతుల (పోర్టులు) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవన్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పోర్టుకు భూసమీకరణ నిమిత్తం జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ మూలపేట, విష్ణుచక్రం గ్రామాలకు సంబంధించిన రైతులతో సమావేశం నిర్వహించినప్పుడు గ్రామస్థులు పోర్టు సంబంధింత భూములన్నీ మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లోనే ఉన్నాయని, పోర్టు ప్రతిపాదిత ప్రాంతంలో భావనపాడు లేనందున పోర్టుకు మూలపేట పోర్టుగా పేరు పెట్టాలని కోరినట్లు జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి విన్నవించారన్నారు. పోర్టు నిర్మాణ ప్రాంతంలోని భూములు, నిర్వాసిత కుటుంబాలన్నీ మూలపేట, విష్ణుచక్రం గ్రామాల పరిధిలో ఉన్నందున గ్రామస్థుల కోరిక మేరకు భావనపాడు పోర్టు పేరును మూలపేట పోర్టుగా మార్చాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపగా, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. గతంలో భావనపాడు పోర్టుగా నోటిఫై చేసిన ప్రాంతాన్ని ఇకపై మూలపేట పోర్టుగా పరిగణించాలని, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సదరు మూలపేట పోర్టుకు ఏప్రిల్ 19వ తేదీన భూమిపూజ చేయనున్నారని పెట్టుబడులు మరియు మౌలిక వసతుల (పోర్టులు) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ. కరికాల్ వలవన్ తెలిపారు. -
చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయరు?
హైదరాబాద్ : ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో దినకరన్‌ను అరెస్ట్ చేసినప్పుడు ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నాయుడును ఎందుకు అరెస్ట్ చేయరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో మరో దోపిడీకి తెర తీస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భావనపాడు పోర్టుకు గ్లోబల్ టెండర్లు ఎందుకు పిలవలేదని బొత్స ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోర్టు ఆదాయంలో 2.3 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి జరిగిన ఒప్పందాల వెనక ఉన్న లొసుగులు ఏంటో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో డబ్బు సంచులు మోసినవారికి నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు ఇస్తున్నారని బొత్స ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు పనుల్లో దోచుకున్నట్లుగానే భావనపాడులో కూడా మరో దోపిడికి సిద్ధమయ్యారన్నారు. కిరీటాలు ఉత్తరాంధ్రకు కాదని, ఆయన కుటుంబానికే అని అన్నారు. ఇకనైనా చంద్రబాబు అబద్ధాలు ఆడటం ఆపాలని బొత్స సూచించారు. ఇసుక దోపిడీని మొదటే అడ్డుకుని ఉంటే చిత్తూరు జిల్లా ఏడ్పేరు ప్రమాదం జరిగేది కాదని ఆయన అన్నారు. -
చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయరు?