మెదక్ లోక్సభ సభ్యురాలు విజయశాంతి ఈరోజు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరితో కలిసి ఆమె సోనియాను కలిశారు. నిన్న ఇక్కడకు వచ్చిన విజయశాంతి కాంగ్రెస్ పార్టీ నేతలను కలుస్తున్నారు. గత నెల 31న విజయశాంతిని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. విజయశాంతి అనేకసార్లు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు సస్పెన్షన్ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఆమె ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కూడా కలిసినట్లు తమకు సమాచారం ఉందని తెలిపారు. అందుకే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొన్నాళ్లుగా టిఆర్ఎస్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నవిజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో టిఆర్ఎస్ పార్టీకి, విజయశాంతికి మధ్య దూరం బాగా పెరిగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూల నిర్ణయాన్ని ప్రకటించిన సందర్భంగా తెలంగాణ భవన్లో భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నా ఆమె మాత్రం దూరంగానే ఉండిపోయారు. ఈ నేపధ్యంలో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపధ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నేతలను కలుస్తుండటంతో విజయశాంతి కాంగ్రెస్లో చేరడం ఖాయమని భావిస్తున్నారు.
Aug 8 2013 7:19 PM | Updated on Mar 22 2024 11:32 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement