వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్లో రాజకీయవేడి రాజుకుంది. ఇప్పటికే వలసలు జోరందుకోవడం, ప్రచారంతో ఆ రాష్ట్రం హోరెత్తిపోతుండగా, ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల నాయకులపై దాడులకు దిగుతున్నారు. కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ కాన్వాయ్పై ఆదివారం దాడి జరిగింది. అనుప్రియ ప్రతాప్గఢ్ జిల్లా పర్యటనకు వెళ్లినపుడు ఈ ఘటన చోటుచేసుకుంది