breaking news
Union minister Anupriya Patel
-
కేంద్రమంత్రి కాన్వాయ్‌పై దాడి
-
కేంద్రమంత్రి కాన్వాయ్‌పై దాడి
ప్రతాప్‌గఢ్: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్‌లో రాజకీయవేడి రాజుకుంది. ఇప్పటికే వలసలు జోరందుకోవడం, ప్రచారంతో ఆ రాష్ట్రం హోరెత్తిపోతుండగా, ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల నాయకులపై దాడులకు దిగుతున్నారు. కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ కాన్వాయ్‌పై ఆదివారం దాడి జరిగింది. అనుప్రియ ప్రతాప్‌గఢ్ జిల్లా పర్యటనకు వెళ్లినపుడు ఈ ఘటన చోటుచేసుకుంది. అధికార సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలే తన కాన్వాయ్‌పై దాడిచేశారని ఆమె ఆరోపించారు. తన కాన్వాయ్‌పై దాడి చేయడం పట్ల కేంద్రమంత్రి నిరసన వ్యక్తం చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆప్నా దళ్‌కు చెందిన ఎంపీ అనుప్రియకు స్థానం దక్కిన సంగతి తెలిసిందే. యూపీ ఎన్నికల్లో ఆమె బీజేపీ తరపున ప్రచారం చేయనున్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం యూపీలో ఎన్నికల ప్రచారయాత్ర నిర్వహిస్తున్నారు. -
కేంద్రమంత్రి అనుప్రియ కూడా బాధితురాలేనట
న్యూఢిల్లీ: ప్రముఖుల పేరు మీద సోషల్ మీడియాలో నకిలీ ఎకౌంట్లు తెరిచి వివాదాస్పద, విద్వేషపూరిత కామెంట్లు పోస్ట్ చేసిన సంఘటనలు గతంలో చాలా వెలుగు చూశాయి. ఇలాంటి బాధిత ప్రముఖల జాబితాలో కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని అనుప్రియ స్వయంగా చెప్పారు. కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ ఇటీవల తన ప్రమేయం లేకుండానే ఓ వివాదంలో చిక్కుకున్నారు. అనుప్రియ పేరు మీద ఎవరో ట్విట్టర్ లో నకిలీ ఎకౌంట్ తెరిచి, ఓ మతాన్ని లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత కామెంట్లు పోస్ట్ చేశారు. కొన్ని గంటల్లో ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి వెంటనే ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. ఇక నుంచి ఇలాంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉంటానని అనుప్రియ చెప్పారు. 'నా పేరు మీద ట్విట్టర్ నకిలీ ఖాతాలో విద్వేషపూరిత కామెంట్లు పోస్ట్ చేశారు. ఈ విషయం తెలియగానే ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశా. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరాను. నకిలీ ఎకౌంట్లను నియంత్రించాలి. ఇలాంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉంటాను. ఎక్కడైనా తప్పు జరిగితే వెంటనే చర్యలు తీసుకుంటా' అని అనుప్రియ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన, ఆప్నా దళ్ చీలికవర్గం నాయకురాలు అనుప్రియకు ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి లభించిన సంగతి తెలిసిందే. ఆమె యూపీలో మీర్జాపూర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఆమే పిన్నవయస్కురాలు.