తెలంగాణ ప్రక్రియను ఆపేది లేదు: దిగ్విజయ్‌ | Telangana process is not stopped says Digvijaya Singh | Sakshi
Sakshi News home page

Aug 13 2013 10:33 PM | Updated on Mar 21 2024 7:52 PM

తెలంగాణ ప్రక్రియను ఆపేది లేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌ సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై సందేహాలన్నీ పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ వార్‌రూమ్‌లో ఏకే ఆంటోనీతో సమావేశమయిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలు ఇచ్చిన లేఖల ఆధారంగానే రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నామని దిగ్విజయ్‌ సింగ్ చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ముసాయిదా బిల్లు పార్లమెంట్ ఉభయసభల్లో చర్చకు వస్తుందని తెలిపారు. ఏపీ ఎన్జీవోలు సమ్మె విరమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement