కేసీఆర్‌ను టార్గెట్ చేసిన సోనియా | sonia targets kcr | Sakshi
Sakshi News home page

Apr 27 2014 8:55 PM | Updated on Mar 22 2024 11:17 AM

ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లాలో ఆందోల్ బహిరంగ సభలో పాల్గొన్న ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు లక్ష్యంగా విమర్శలు చేశారు. టీఆర్ఎస్కు నీతి, విధానం అంటూ లేవని.. ఆ పార్టీ చేస్తున్న బెదిరింపు, ద్వేషపూరిత రాజకీయాలు తెలంగాణకు నష్టం చేస్తాయని సోనియా అన్నారు. తెలంగాణ ఇచ్చేందుకు చాలా కష్టపడ్డామని, రాజకీయంగా కలిగే నష్టాన్ని కూడా లెక్కచేయకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని సోనియా చెప్పారు. అయితే తెలంగాణ తెచ్చింది తామే అంటూ టీఆర్ఎస్ మభ్య పెడుతోందని సోనియా విమర్శించారు. విలీన అంశంపై మాటమార్చి మోసం చేసిందని ఆరోపించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందినప్పుడు కేసీఆర్ సభలోనే లేరని సోనియా ఎద్దేవా చేశారు. అధికారం, సీఎం పదవే ఆయన అజెండా అని విమర్శించారు. సామాజిక న్యాయమే కాంగ్రెస్ ధ్యేయమని, టీడీపీ, బీజేపీ ఛాందసవాద రాజకీయాలు చేస్తున్నాయని సోనియా మండిపడ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement