సౌరవిమానయానంలో రికార్డు | Sakshi
Sakshi News home page

సౌరవిమానయానంలో రికార్డు

Published Sat, Jul 4 2015 10:40 AM

కేవలం సౌరవిద్యుత్‌తో నడిచే ‘సోలార్ ఇంపల్స్2’ విమానం చరిత్ర సృష్టించింది. జపాన్‌లోని నగోయా నుంచి సోమవారం బయలుదేరిన ఈ సౌర విమానం ఏకబిగిన 120 గంటలు... 7,900 కిలోమీటర్లు ప్రయాణించి శుక్రవారం రాత్రి పదిగంటలకు (భారత కాలమానం ప్రకారం) అమెరికాలోని హవాయి దీవులకు చేరుకుంది. నిరంతరాయం గా సుదీర్ఘసమయం ప్రయాణించిన రికార్డు ఇంతకుమునుపు స్టీవ్ ఫోసెట్ పేరిట ఉంది. ఆయన 2006లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన జెట్ విమానంలో 76 గంటల 45 నిమిషాలు ప్రయాణించారు.

Advertisement