నోట్ల రద్దుపై పార్లమెంటులో గందరగోళం కొనసాగుతోంది. సోమవారం కూడా ఉభయసభలూ చర్చ జరగకుండానే వాయిదా పడ్డాయి. విపక్షాలు సభాకార్యక్రమాలను అడ్డుకోవటం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు యత్నించారుు. నోట్ల మార్పిడి కోసం బ్యాంకు క్యూలైన్లలో ప్రాణాలు కోల్పోరుున వారిపై (70 మంది) సంతాప తీర్మానం కోసం రాజ్యసభలో విపక్షాలంతా ఏకమై డిమాండ్ చేశారుు. దీనిపై చర్చకు ఓటింగ్ పెట్టాలని ఒత్తిడి చేశారుు. సభాకార్యక్రమాలను అడ్డుకున్నారుు. దీంతో తీవ్ర గందరగోళం నడుమ సభ మంగళవారానికి వారుుదా పడింది. అటు లోక్‌సభలో వారుుదా తీర్మానంకు విపక్షాలు పట్టుబట్టడంతో వరుసగా మూడోరోజూ ఎలాంటి చర్చ జరగకుండానే సభ వారుుదా పడింది.
Nov 22 2016 7:22 AM | Updated on Mar 22 2024 11:13 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement