‘‘మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది’’ అని శ్రీరంగం శ్రీనివాసరావు అప్పుడెప్పుడో గట్టిగానే పిలుపునిచ్చాడుగానీ.. ఆ ప్రపంచం ఇప్పటికీ వాస్తవం కాలేదు. ఈలోపు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు మాత్రం.. మరో ప్రపంచాన్ని మాత్రమే కాదు. ఏకంగా ఇంకో సౌర కుటుంబాన్నే ఆవిష్కరించారు.