పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్ర హైకోర్టు షాకిచ్చింది. పలువురు తృణమూల్ కాంగ్రెస్ నేతలు ముడుపులు తీసుకుంటూ నారద న్యూస్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిన వ్యవహారంలో ప్రాథమిక విచారణ చేయాలని కలకత్తా హైకోర్టు శుక్రవారం సీబీఐని ఆదేశించింది. స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని, వస్తువులను 24 గంటల్లో స్వాధీనం చేసుకోవాలని, 72 గంటల్లో ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని ధర్మాసనం సీబీఐని ఆదేశించింది. ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత అవసరమైతే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, తర్వాత దర్యాప్తు కొనసాగించాలని పేర్కొంది.