ఓటుకు కోట్లు కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఎ-4 నిందితుడిగా ఉన్న మత్తయ్య తన పేరును ఈ కేసు ఎఫ్ఐఆర్ నుంచి తొలగించాలంటూ హైకోర్టును ఆశ్రయించాడు. గురువారం మత్తయ్య హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసుతో తనకెలాంటి ప్రమేయం లేదని మత్తయ్య హైకోర్టుకు విన్నవించాడు.