నాకు పాదాభివందనం చేయొద్దు: మోడీ | dont-touch-my-feet-narendra-modi-tells-mps | Sakshi
Sakshi News home page

Jun 6 2014 4:30 PM | Updated on Mar 22 2024 11:30 AM

వ్యక్తిపూజ సంస్కృతిని ప్రధాని నరేంద్ర మోడీ నిరసించారు. తనకు పాదనమస్కారం చేయొద్దని ఎంపీలకు, బీజేపీ నాయకులకు సూచించారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలను ఉద్దేశించి పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో మోడీ శుక్రవారం ప్రసంగించారు. తనకు పాదాభివందనం చేయొద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు. వ్యక్తిపూజకు తాను వ్యతిరేకమని తేల్చిచెప్పారు. కష్టపడి పనిచేయాలని ఎంపీలకు ఆయన సూచించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సామర్థ్యాలు పెంచుకుని మంచి పార్లమెంటేరియన్లుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎంపీలకు మోడీ సూచించారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement