టి.బిల్లు పెడితే రాజకీయ సన్యాసం-కిరణ్ | cm kiran kumar reddy quit politics if telangana draft bill admit to parliament | Sakshi
Sakshi News home page

Jan 29 2014 3:46 PM | Updated on Mar 20 2024 12:42 PM

తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చకు గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంచలనల వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి పంపిన బిల్లు ఉన్నది ఉన్నట్టు పార్లమెంట్లో ప్రవేశపెడితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన అన్నారు. బిల్లుపై హోంశాఖ రాష్ట్రపతిని మోసం చేసినట్లుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్టప్రతి నుంచి వచ్చే బిల్లులో లోపాలు లేకుండా చూడాల్సిన బాధ్యత హోంశాఖపై ఉందన్నారు. బిల్లులోని లోపాలను సరిచేయమని కోరడం లేదు బిల్లును తిరస్కరిస్తున్నట్టు అసెంబ్లీలో తీర్మానం చేయమని కోరుతున్నామని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement