ఒలింపిక్స్ లో వెండి పతకం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా సత్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో సింధుతో పాటు కోచ్ పుల్లెల గోపీచంద్ ను గజమాలతో ఘనంగా సన్మానించారు.