చంద్రబాబు నాయుడు తన ఆస్తులను ప్రకటించినా, ప్రకటించకపోయినా తెలుగు ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆస్తుల ప్రకటన అంతా బోగస్ అని కొట్టిపారేశారు.