విరుచుకుపడ్డ మావోయిస్టులు | BSF trainee personnel killed in odisha | Sakshi
Sakshi News home page

Feb 2 2017 6:12 AM | Updated on Mar 21 2024 8:11 PM

మావోయిస్టులు చెలరేగి పోయారు. ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లాలో కేంద్ర బలగాలే లక్ష్యంగా మందుపాతర పేల్చి భారీ దాడికి దిగారు. 13 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లు వస్తున్న జీపును లక్ష్యంగా ఎంచుకుని సాలూరు–జైపూర్‌ మధ్య 26వ నంబర్‌ జాతీయ రహదారిపై ముంగిరిగుమ్మి వద్ద బుధవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో కల్వర్టును పేల్చి వేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగా త్రులకు తొలుత సాలూరు, ఒడిశాలోని పొట్టంగి ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసి, అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖలోని సెవెన్ హిల్స్‌ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలు తునాతునకల య్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement