ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే భక్తరామదాసు ప్రాజెక్టును సీఎం కె. చంద్రశేఖర రావు మంగళవారం జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు రికార్డు సమయంలో 11నెలల్లోనే పూర్తయింది. ట్రయల్‌రన్ కూడా విజయవంతమైంది. సీఎం శంకుస్థాపన చేసి.. ప్రారంభోత్సవం చేస్తున్న తొలి సాగునీటి ప్రాజెక్టు ఇదే. పాలేరు నియోజక వర్గంలోని భూములకు సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో రూ.335.59 కోట్ల అంచనాతో భక్త రామదాసు ప్రాజెక్టును రూపొందించారు. 2015 డిసెంబర్ 15న రూ.90.87 కోట్లకు పరిపాలన అనుమతులు లభించాయి.