దేశీయ బ్యాంకింగ్ రంగంలో స్థిరీకరణ దిశగా మరో కీలక అడుగు పడింది. ఐదు అనుబంధ బ్యాంకులను తనలో విలీనం చేసుకునేందుకు ఎస్‌బీఐకి కేంద్ర కేబినెట్ బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐదు అనుబంధ బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంకు ఎస్‌బీఐలో విలీనానికి కేంద్ర ప్రభుత్వం గతంలో సూత్రప్రాయ ఆమోదం మాత్రమే తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ తుది అనుమతి మంజూరు చేసింది. అయితే, భారతీయ మహిళా బ్యాంకు విలీనం విషయంలో ఏ నిర్ణయాన్ని తీసుకోలేదు. ‘‘విలీన ప్రణాళికకు గతంలో కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం మాత్రమే తెలిపింది.