‘మాకు పైనుంచి కాలువ తవ్వి పైపులైన్లు వేయమన్నారు.. వేస్తున్నాం అంతే.. డబ్బు మాత్రం ఇచ్చేది లేదు’ అని కాంట్రాక్ట్ మనుషులు దౌర్జన్యం చేస్తున్నారు. పొలాల్లో ఉన్న నిమ్మ, మామిడి చెట్లకు ఒక్కొక్కదానికి కేవలం వెయ్యి, పదిహేను వందలు ఇస్తారంట. చంటిబిడ్డలను సాకినట్లు ఎంతో కష్టపడి చెట్లను పెంచితే, ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇస్తామంటే ఏమన్నా అర్థముందా? గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కాలేటివాగు పనుల పైపులైను మా భూముల్లోంచి వెళ్లినప్పుడు లక్షల్లో పరిహారం వచ్చింది. ఇప్పుడు పైసా ఇవ్వం అని కరాఖండిగా చెబుతున్నారు. – కొప్పర్తి ఉత్తమారెడ్డి, గంగారపువాండ్లపల్లె.


