దళితమిత్ర సంఘ కార్యవర్గ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

దళితమిత్ర సంఘ కార్యవర్గ ఎన్నిక

Sep 1 2026 1:49 AM | Updated on Sep 1 2026 1:49 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : దళితమిత్ర సంఘ అన్నమయ్య, తిరుపతి జిల్లాల కార్యవర్గ ఎన్నిక సోమవారం కడప నగరంలోని ఆ సంఘ కార్యాలయంలో నిర్వహించారు. సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు కై పు రామాంజనేయులు అధ్యక్షతన రెండు జిల్లాల సమావేశం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా ఇన్‌ఛార్జిగా కరకోటి కిశోర్‌బాబు, తిరుపతి జిల్లా ఇన్‌ఛార్జిగా పూజారి ప్రశాంత్‌ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మునీంద్ర, చాట్ల వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

నగర అధ్యక్షుడిగా వినయ్‌కుమార్‌

జిల్లా దళిత అభివృద్ధి సంక్షేమ సేవా సంఘం నగర అధ్యక్షుడిగా కడప ఎర్రముక్కపల్లెకు చెందిన బాలె వినయ్‌కుమార్‌ ఎన్నికయ్యారు. సోమ వారం నగరంలోని ఆ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయనను ఎన్నుకున్నామని జిల్లా అధ్యక్షుడు వీఆర్‌ శంకర్‌ తెలిపారు. ఈ సందర్భంగా వినయ్‌కుమార్‌ మాట్లాడుతూ దళిత వర్గాల అభ్యున్నతికి పోరాడుతామని తెలిపారు.

సమస్యల పరిష్కారంలో నాణ్యత

– జేసీ డాక్టర్‌ నిఽధి మీనా

కడప సెవెన్‌రోడ్స్‌ : ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిర్దిష్ట సమయంలో తగిన పరిష్కారం చూపాలని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ నిధి మీనా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సభా భవనంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఆయ న అర్జీలు స్వీకరించారు. ప్రతి కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌ ఫీడ్‌ బ్యాక్‌ క్యూఆర్‌ కోడ్‌లను ప్రదర్శించాలన్నారు. సేవలు పొందిన వెంటనే ప్రజలు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి తమ అభిప్రాయాలు నమోదు చేయవచ్చన్నారు. డీఆర్వో మల్లికార్జునుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కల్లూరిపల్లె తాండా సమస్యలు పరిష్కరించాలి

కడప సెవెన్‌రోడ్స్‌ : చక్రాయపేట మండలం కల్లూరిపల్లె తాండాలో తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు, స్మశాన వాటిక సమస్యలను పరిష్కరించాలని ఏఐబీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు జగన్‌ రాథోడ్‌ కోరారు. ఈ మేరకు సోమవారం జేసీ నిధిమీనాకు వినతిపత్రమిచ్చారు. సుమారు 1200మందికి పైగా జనాభా నివసిస్తున్నప్పటికీ కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బోర్లు ఏర్పాటు చేసి శాశ్వతంగా తాగునీటి వసతి కల్పించాలన్నారు. రాత్రివేళల్లో వీధి లైట్లు లేకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. తాండా వాసులు బాలాజీనాయక్‌, దేవేంద్రనాయక్‌, రామస్వామి నాయక్‌, చిన్న వెంకటేశ్‌ నాయక్‌, ఈశ్వర్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

23 నుంచి సహకార

సంఘాల ఎన్నికలు

– జిల్లా పశుసంవర్థశాఖ జేడీ

డా. విజయలక్ష్మి

కడప అగ్రికల్చర్‌: పాత కడప జిల్లా పరిధిలోని 139 ప్రాథమిక గొర్రెల పెంపక దారుల సహకార సంఘాలకు కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లా కలెక్టర్ల అనుమతి మేరకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా పశుసంవర్థశాఖ జాయింట్‌ డైరెక్టర్‌, జిల్లా గొర్రెల పెంపకదారుల సహకార యూనియన్‌ లిమిటెడ్‌ కడప ఫంక్షనల్‌ రిజిస్టార్‌ డాక్టర్‌. విజయలక్ష్మి తెలిపారు. కడపలోని జిల్లా పశుసంవర్ధశాఖ కార్యాలయంలో ఆమె సోమవారం మాట్లాడారు. ప్రాథమిక గొర్రెల పెంపక దారుల సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్‌ 23, 25, 28వ తేదీలలో మూడు విడతలగా ఎన్నికలు జరగుతాయని అన్నారు. అక్టోబర్‌ నెల 8వ తేదీ నాటికి సంఘాల కాల పరిమితి ముగిస్తున్నందున ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మొదటి విడతలో 52 సొసైటీలకు, రెండవ విడతలో 42 సొసైటీలకు, మూడవ విడతలో 45 సొసైటీలకు ఈ ఎన్నికలు జరగుతాయని అన్నారు. జిల్లాలోని ప్రస్తుత ప్రాథమిక సంఘాల అధ్యక్షులు, స్థానిక పశు వైద్యాధికారులు ఎన్నికల అధికారులకు సహకరించాలని జిల్లా గొర్రెల పెంపకదారుల సహకార యూనియన్‌ లిమిటెడ్‌ ఫంక్షనల్‌ కార్య నిర్వాహక డైరెక్టర్‌ డాక్టర్‌ పి రమణారెడ్డి కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement