ఇల్లు.. ఇంకెన్నాళ్లు! | - | Sakshi
Sakshi News home page

ఇల్లు.. ఇంకెన్నాళ్లు!

May 8 2026 11:08 AM | Updated on May 8 2026 11:08 AM

కడప సిటీ : గ్రామీణ ప్రాంత పేద ప్రజలపై కూటమి ప్రభుత్వం కత్తిగట్టింది. వారి సొంతింటి కల సాకారానికి అడుగడుగునా అడ్డుపడుతోంది. ఇదిగో అదిగో అంటూ సర్వేలతోనే కాలయాపన చేస్తోంది. ఎన్‌డీయే ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన అర్బన్‌ 2.0తో పట్టణ ప్రజలకు, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన్‌ 2.0 గ్రామీణ పేరుతో పల్లెవాసులకు అర్హులకు ఇళ్లు మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ పథకం పట్టణాల్లోనే అమలవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో అమలు కావడం లేదు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజల్లో తీవ్ర నిరాశ నిస్పృహ నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు ఇప్పటికే సర్వే చేసి నివేదికలు ప్రభుత్వానికి అందజేశారు. సర్వే పూర్తయి చాలారోజులైనప్పటికీ ఇళ్లు మంజూరు కాకపోవడంతో పల్లె ప్రజలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

కరుణించని బాబు సర్కారు

ఒకటా రెండా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల మంజూరు కోసం అధికారులు సర్వే చేసి నెలలు గడుస్తోంది. ఈ పథకానికి జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు అనర్హులను తొలగించి అర్హుల జాబితా నివేదికలను ప్రభుత్వానికి కూడా అందజేశారు. కానీ ఇల్లు మంజూరుకు కూటమిసర్కారుకుమనసు రావడం లేదు. మరోవైపు పీఎంఏవై అర్బన్‌ 2.0 అనే పథకం ద్వారా పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం సాగుతోంది.

నియోజకవర్గాల వారీగా..

గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల మంజూరు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పీఎంఏవై 2.0 పథకం కింద ఇప్పటివరకు 36,477 మందికి ఇళ్లు అవసరమని సర్వేలో తేల్చారు. నియోజకవర్గాల వారీగా చూస్తే కమలాపురంలో 3987, ప్రొద్దుటూరు 3747, జమ్మలమడుగు 5,805, పులివెందుల 6088, రాజంపేట 8991, బద్వేలు 3982, మైదుకూరు 3877, రాజంపేటలో 8991 ఇళ్లను నిర్మించుకునేందుకు మంజూరు చేయాలని అఽధికారులు ప్రభుత్వానికి నివేదించారు.

గ్రామీణ ప్రాంతాల్లో మంజూరు కాని ఇళ్లు

సర్వేతో కాలయాపన

30 వేల ఇళ్లు మంజూరు ఎప్పుడో?

Advertisement
 
Advertisement
Advertisement